![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఇంకా గొడవలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'ఆఖరి పోరాటం' అనే టాస్క్ ఇచ్చాడు. "మీకు ఆడియో రూపంలో భిన్నమైన సౌండ్స్ ఒక సీక్వెన్స్ గా వినిపిస్తాయి. అవి ఏంటో గుర్తించి, ఎవరు ఎక్కువగా రాస్తారో వారే ఈ టాస్క్ విజేత. ఈ టాస్క్ లో గెలిచిన వారు 'వోట్ ఫర్ మి' అప్పీల్ కి అర్హత సాధిస్తారు" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో చురుకుగా పాల్గొన్నారు. మొదటి ఛాలెంజ్ లో సరిసమానమైన పాయింట్లతో ఆదిరెడ్డి, రోహిత్ లీడ్ లో ఉన్నారు.
అయితే రెండవ ఛాలెంజ్ మొదలయ్యాక, మధ్యలో శ్రీసత్య మాట్లాడింది. దీంతో శ్రీహాన్ పాయింట్లు కోల్పోవలసి వచ్చింది. ఇదే విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. "దండం పెడతాను.. దయచేసి టాస్క్ జరిగేటప్పుడు ఎవ్వరూ మాట్లాడకండి" అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత ఛాలెంజ్ పూర్తి అయ్యింది. ఛాలెంజ్ లో రోహిత్, ఆదిరెడ్డి గెలిచారు. ఇక ఓడిపోయాననే బాధతో శ్రీహాన్, శ్రీసత్యతో గొడవకు దిగాడు.
శ్రీసత్య మాట్లాడుతూ "నా వల్ల గేమ్ పోయింది అంటున్నావ్. నేను ఒక ఛాలెంజ్ లో డిస్టబ్ చేసాను. మరి మిగిలిన రెండింటిలో నువ్వు పాయింట్లు సంపాదించుకోవచ్చు కదా" అని శ్రీహాన్ తో చెప్పింది. శ్రీహాన్ మాట్లాడుతూ "నువ్వు యాక్సెప్ట్ చేయవు. నువ్వు అరవలేదు. కామ్ గా ఉన్నావ్. అప్పుడే నా రెండు పాయింట్లు పోయాయి. అక్కడ రెండు వచ్చి ఉంటే.. మేం ముగ్గురం ఈక్వల్ గా ఉండేవాళ్ళం. సరే సత్య నువ్వే కరెక్ట్. ఒక రౌండ్ లో పోయింది నీ వల్లే. కానీ అలా అంటే నువ్వు ఒప్పుకోవు. తప్పు అయితే ఒప్పుకోవడం రావాలి. మనవల్ల ఏదైనా అయినప్పుడు ఏం ఫీలింగ్ లేకుండా ఉంటారు కదా.. అలా ఉండటం నా వల్ల కాదు" అని శ్రీసత్య మీద కోపంతో అరిచాడు.
![]() |
![]() |